పరకాల నేటిధాత్రి
శ్రీరామ మందిర అక్షింతలు పరకాల మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది.జైశ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున భక్తులు నినాదాలు చేస్తూ గ్రామంలో అయోధ్య రామ మందిరం విశిష్టత గురించి తెలిసే విధంగా భక్తులకు ఇంటింటా కరపత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ముస్కె దేవేందర్ మాట్లాడుతూ ఐదు వందల ఏళ్ల క్రితం అయోధ్యలో రాముడిని ప్రాణ ప్రతిష్టాపన చేసిన సమయంలో స్వామి వారి పాదాల వద్ద ఈ అక్షింతలను భద్రపరిచారని,అయోధ్య రాముడి పునర్నిర్మాణం చేపట్టిన తర్వాత ప్రాణ ప్రతిష్టాపన అక్షింతలు రామాలయం గుడికి అందించడం మాకు మా గ్రామానికి భాగ్యం అని అన్నారు.ఈ కార్యక్రమంలో దుగ్యాల ఆగమరావు,దుగ్యాల సంపత్ రావు,మునిగాల సంతోష్ రావు,స్వామి రావు, మునిగాల విద్యాసాగర్ రావు, పోల్నేని శ్రీనివాసరావు,పోలినేని శ్రీధర్ రావు,వెలగంటి డాక్టర్ రమేష్,ముష్కే సంతోష్, ముష్కే దేవేందర్,పొన్నగంటి నర్సింగారావు,గ్రామ ప్రజలు రామభక్తులు తదితరులు పాల్గొన్నారు.