మంగపేట నేటి ధాత్రి
మంగపేట మండల పరిధిలోని గొందిగూడెం ప్రాథమిక పాఠశాలను సందర్శించి పాఠశాలలో ఉన్న 20 మంది విద్యార్థులకు 5000 రూపాయల విలువైన స్కూల్ బ్యాగ్స్ మరియు నోట్ బుక్స్,పెన్సిల్స్ తదితర వస్తువులను నరసింహసాగర్ గ్రామానికి చెందిన ఈడ్పుగంటి దేవేందర్ ఆర్థిక సహకారంతో అందించడం జరిగింది.ఈ సందర్భంగా విరాళం అందించిన దేవేందర్ కి మండల విద్యాశాఖ తరపున,పాఠశాల తరపున కృతజ్ఞతలు తెలియచేయడం తెలిపారు. ఏజెన్సీ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించి విద్యార్థుల అభ్యున్నతికి సహకరించాలని మంగపేట మండల విద్యాశాఖ అధికారినీ పోదెం మేనక దాతలను కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుల సూక్య ,గ్రామానికి చెందిన శ్రీకాంత్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొనడం జరిగింది.