సమాజసేవే లక్ష్యంగా నృసింహ సేవా వాహిని సేవలు
భద్రాచలం నేటిదాత్రి
భద్రాచలం : గత మూడు రోజులుగా చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేస్తూ సేవలoదిస్తున్న సిబ్బందికి నృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో డా. కృష్ణ చైతన్య స్వామి సూచన మేరకు పులిహోర పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్బంగా నృసింహ సేవా వాహిని సంస్థ ట్రస్టీ శ్రీధర్ శర్మ మాట్లాడుతూ సమాజం కొరకు ప్రతి బిడ్డ ఆరోగ్యం కొరకు ఉదయం నుండి సాయంత్రం వరకు డ్యూటీ చేస్తున్న సిబ్బందికి అవకాశం ఉన్నంత వరకు మా వంతు సహకారం అందించాలనే ఉద్దేశ్యం తో మూడు రోజుల పాటు అన్న ప్రసాదాన్ని అందించామని దూరంగా ఉన్న సిబ్బందికి పులిహోర పొట్లాలు అందించామని అన్నారు.నిజంగా నేడు ఎంతో మందికి ఆకలి తీర్చడం చాలా ఆనందం గా ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమం లో సంస్థ ట్రస్టీ శ్రీధర్ శర్మ, సంస్థ సభ్యులు,పల్స్ పోలియో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.