గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ కు పరశురాంపల్లి ఓసి త్రీ గనిలో కాంట్రాక్టు కార్మికునిగా పనిచేస్తున్న కర్రీ వాసు, అరుణ దంపతులు వారి కుమార్తె యోగిత జన్మదినం సందర్భంగా రూ.5 వేల తో సోమవారం పూజా సామాగ్రిని అందజేశారు మొదట ఆలయంలో స్వామివారికి వాసు అరుణ దంపతులు రుద్రాభిషేకం నిర్వహించారు అనంతరం ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు కోటగుళ్ళకు పూజా సామాగ్రిని అందజేసిన వాసు అరుణ దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది