బంగారు భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడాలి
మొదటి స్థానంలో నిలిచే విధంగా సిద్ధం కావాలి
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో జెడ్ పి ఎస్ ఎస్ ప్రభుత్వ బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో పదోవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు సామల వీరేశం జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి గురువారం విద్యార్థినీ విద్యార్థులకు ఒక్కొక్కరికి పరీక్ష ప్యాడు రెండు పెన్నులను బహుకరించారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి మాట్లాడుతూ నిర్దిష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకొని దృఢ సంకల్పం, పట్టుదలతో విజయతీరాలను చేరేవరకు నిర్విరామంగా కృషి చేయాలని క్రమం తప్పకుండా శ్రమిస్తే కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టంతో చదివి పరీక్షలలో 10/10 జి పి మార్కులు సాధించాలని విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఉపాధ్యాయులకు పాఠశాలకు తల్లిదండ్రులకు పేరు, మొదటి స్థానం నిలిచే విధంగా విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి వెంకటేశ్వరరావు బాలికల పాఠశాల ప్రధానోపాధ్యా యురాలు శ్రీలత ఉపాధ్యాయులు,శ్రీనివాస్, సదానందం హాజీముద్దీన్ రాజబాబు రావు సత్య ప్రసాద్ ఉదయశ్రీ, శేఖర్ బాబు లీలావతి, యోగిత కిరణ్మయి దుర్గ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.