చందుర్తి, నేటిధాత్రి:
రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్ధిళ్ల శ్రీను బాబు జన్మదిన సందర్భంగా పదవ తరగతి విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షిస్తు చందుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జడ్పిటిసి నాగం కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులతో పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో
రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి బీమ్ రాజ్ కనకరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్ట ప్రభాకర్, ఎంపీటీసీ మ్యాకల గణేష్ , నాయకులు దూది శ్రీనివాసరెడ్డి, లింగంపల్లి అజయ్,సంతపురి బాలు రెడ్డి, యువ నాయకులు మల్యాల రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
