పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ
ఎనుమాముల: నేటి ధాత్రి ;
లక్ష్మీపురం మోడల్ కూరగాయల మార్కెట్లో బుధవారం రోజున 12 మంది పారిశుద్ధ్య కార్మికులకు క్రిస్టమస్ పండుగ సందర్భంగా వరంగల్ జిల్లా హోల్ సేల్, రిటైల్ కూరగాయల మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 10 వేల రూపాయల దుస్తులు పంపిణీ చేస్తూ అదనంగా ప్రతి ఒక్కరికి 400/- రూపాయలు అందించడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ బాధ్యులు సిరబోయిన మహేష్, బేతి బలరాం, మంద రంజిత్, బండారి రమేష్,సుర శ్రీను, హరీష్,అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.
