రామకృష్ణాపూర్,జనవరి 08, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటి పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణం లో గల 19 ,20వ వార్డులల్లో అయోధ్య రామయ్య అక్షింతలు గడపగడపకు అందించారు. శ్రీనివాస్ నగర్ లోని కాలనీవాసులు భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ దుస్తులతో మంగళ హారతులతో పట్టణం లోని కోదండ రామాలయం గుడికి వెళ్లారు.శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు జిల్లా సభ్యులు వేముల హరిప్రసాద్, రామాలయ మందిర పురోహితులు అంబ ప్రసాద్ లు అయోధ్య రాముని అక్షింతలను శ్రీనివాస నగర్ కాలనీవాసులకు అందించినట్లు పేర్కొన్నారు. అయోధ్య అక్షింతలను శ్రీనివాస్ నగర్ లోని గడపగడపకు శ్రీరామ జయరామ అనే జపంతో అక్షంతలు అందించడం జరిగిందని కాలనీవాసులు పేర్కొన్నారు.అక్షింతలు పంపిణీ చేసిన కార్యక్రమంలో వేముల సరస్వతి అశోక్ దంపతులు,ముద్దసాని భాగ్యలక్ష్మి శ్రీనివాస్ దంపతులు, వేముల రాజేశం రాజా మల్లమ్మ దంపతులు, మామిడాల సులోచన రాజయ్య దంపతులు, హనుమండ్ల సత్యం దంపతులు, రమణయ్య దంపతులు,పచ్చిక లక్ష్మారెడ్డి,బద్రి సతీష్, గాజుల చంద్ర కిరణ్ ,వేముల సురేందర్, క్యాతం రాజేశం తదితరులు పాల్గొన్నారు.