ఎంపీడీవో కార్యాలయం
ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలోని పెద్దకోడెపాక గ్రామంలోని దళిత వాడలలో గత 15 రోజుల నుండి నల్ల పంపులు రాక గ్రామస్తులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు మంగళవారం రోజున మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని కాలి బిందెలతో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మంద శ్రీకాంత్ మాట్లాడుతూ గత 15 రోజుల నుండి గ్రామంలో నల్ల పంపులు వాటర్ రాక గ్రామస్తులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.ఈ సమస్యపై గత పది రోజుల క్రితం గ్రామపంచాయతీ కార్యదర్శి గారికి చెప్పిన పట్టించుకో లేదు అన్నారు అలాగే ఈ సమస్యపై ఎంపీడీవో కార్యాలయంలో చెప్పిన కూడా పై అధికారులు ఎవరు స్పందించ లేదన్నారు అధికారులు మండల కేంద్రంలో గ్రామంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అలాగే మండల కేంద్రానికి ఇన్చార్జి ఎంపీడీవోను కేటాయించారు కానీ ఆ ఎంపీడీవో మండల ప్రజలకి అందుబాటులో ఉండడం లేదన్నారు తదితర సమస్యలపై ఫోన్ చేస్తే కూడా స్పందించడం లేదన్నారు ముఖ్యంగా పెద్ద కొడపాక గ్రామ పంచాయతీ కార్యదర్శి సస్పెండ్ చేయాలన్నారు గ్రామ సమస్యలను పరిష్కరించ కుండా విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారు అన్నారు ఇప్పటికైనా గ్రామంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని త్వరగా పరిష్కరించాలన్నారు లేదంటే హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు గ్రామస్తులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు బొచ్చు కళ్యాణ్ ఇస్మాయిల్ బొచ్చు ఈశ్వర్ గణేష్ రాజ్ కుమార్ శశాంక్ నవీన్ రాజ్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.