దళిత హక్కుల పోరాట సమితి.
వరంగల్ తూర్పు నేటిధాత్రి.
దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయం తమ్మెర భవన్ లో జిల్లా అధ్యక్షులు సంఘీ ఏలేందర్, ప్రధాన కార్యదర్శి జన్ను రవి దళితుల సమావేశం నిర్వంచారు.ఈనెల 23 న వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దళితుల కోసం ప్రభుత్వాన్ని పలు డిమాండ్ లు చేయడం జరిగింది.
⏩దేశవ్యాప్తంగా ఎస్ సి సబ్ ప్లాన్ చట్టం అమలతో పాటు మరియు రాష్ట్ర అసెంబ్లీలో జనాభా ఆధారంగా బడ్జెట్ ను కేటాయింపు చేయాలి.
⏩ప్రైవేటు రంగాల్లో దళితులకు రిజర్వేషన్ అమలు చేయాలి.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం నిలిపివేయాలి.
⏩ఎస్సీ ఇండస్ట్రీ సబ్సిడీ నిధులను వెంటనే విడుదల చేయాలి.
⏩ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు సబ్సిడీ నిధులను విడుదల చేయాలి. ⏩నూతనంగా ఎస్సీ కార్పొరేషన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి.
⏩ దళితులపై దౌర్జన్యాలు మరియు అంటరానితనాన్ని తక్షణమే నిలిపివేయాలి.
⏩భారత రాజ్యాంగం ప్రకారం దళితులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులను కల్పించాలి.
⏩దళితులకు విద్యా హక్కు, భూమి హక్కు మరియు ఉపాధి అవకాశాలు కల్పించాలి.
⏩సాధారణ జనాభాగణతో పాటు సామాజిక,ఆర్థిక కులగణన నిర్వహించాల ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేశారు. ఈ డిమాండ్లు పరిష్కరించకపోతే ప్రతి జిల్లాలో కలెక్టరేట్ ముందు ధర్నాలు నిర్వహించడం జరుగుతుందనీ తెలిపారు.