శ్రీరాంపూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు ఖమ్మం ఐలయ్య, బోడ రామకృష్ణ లు అయ్యప్ప మాల ధరించి మహా పాదయాత్ర ద్వారా ఏరియాలోని శ్రీ భక్తాంజనేయ ఆలయం నుండి బుధవారం వెళ్తుండగా యాత్రను అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ (ఏబిఏపి) జాతీయ ప్రధాన కార్యదర్శి బేతి తిరుమల్ రావు, నరహరి శర్మ గురు స్వామి, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి లు ప్రారంభించారు. జిల్లా అధికార ప్రతినిధి భాస్కర్ల రాజేశం, ఏరియా అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సాదు వీర భద్ర స్వామి ల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు మహాపాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర చేస్తున్న అయ్యప్ప భక్తులను సన్నిధానం గురు స్వాములు శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ పాదయాత్ర చేస్తున్న భక్తులు సుమారు 1400 కిలోమీటర్లు ప్రయాణిస్తారని పేర్కొన్నారు. పాదయాత్ర చేస్తున్న భక్తులకు భగవంతుడు ఆరోగ్యం, శక్తిని కల్పించి అయ్యప్ప స్వామి సన్నిధికి చేరుకునే లాగా చూడాలని నరహరి శర్మ గురుస్వామి కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సిరిపురం రాజేశం, ఆలయ కమిటీ చైర్మన్ మల్లెత్తుల రాజేంద్రపాణి, ఉపాధ్యక్షుడు సంకేనపల్లి రాజేందర్, కార్యదర్శి రవికృష్ణ,కొండాల్ రెడ్డి,మధు,రెడ్యానాయక్, కుమార్,చారి, సదానందం, నవీన్,కుమారస్వామి, శ్రీనివాస్,సతీష్,భరత్ రెడ్డి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.