ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా కేంద్రంలోని స్థానిక క్రిష్ణకాలని అంబేద్కర్ స్టేడియం ఎదురుగా ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. ఈ సందర్భముగా కమిటీ సభ్యులు మాదాసి శ్రీనివాస్ ( కరాటే ), శీలం సదిరాజు, మేదరి సుమన్ మాట్లాడుతూ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో 13 సంవత్సరాలనుండి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, శ్రీ కొదురుపాక కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో 9 రోజులపాటు భక్తి శ్రద్ధలతో పూజలు, మహా అన్నదాన కార్యక్రమం, కుంకుమ పూజ, మహా చంఢీయాగం తదితర కార్యక్రమాలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. మంగళవారం డప్పుచెప్పుల్లతో ఊరేగించి అనంతరం త్రివేణి సంగమం కాళేశ్వరంలో నిమజ్జనం చేసినట్లు వారు తెలిపారు. ఉత్సవాలకు సహకరించిన కాలనీవాసులకు ఈ సందర్భముగా వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version