అండగా ఉందాం..గండ్ర వెంకట రమణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం..!
యాదవుల ఆత్మీయ సమావేశంలో చిట్యాల ఏఎంసీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్ పిలుపు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 11
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే యాదవులు అభివృద్ధి చెందారని, యాదవ కులస్తులంతా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి..జరగబోయే భూపాలపల్లి శాసనసభ ఎన్నికల్లో గండ్ర వెంకటరమణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చిట్యాల ఏఎంసీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్ యాదవ కులస్తులకు పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ మోటే ధర్మన్న, యాదవ సంఘం మండల అధ్యక్షులు ఆకుల వీరన్న అధ్యక్షతన జరిగినటువంటి యాదవుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల యాదవ కులస్తులు ఎంతో బాగుపడ్డారని, సబ్బండ వర్గాల ప్రజల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను ముచ్చటగా మూడోసారి సీఎంను చేయాలంటే..గండ్ర వెంకట రమణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి..సీఎం కేసీఆర్ కు కానుకనివ్వాలని కోరగా..యాదవ కులస్తులంతా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గండ్ర వెంకట రమణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యతను తమ భుజస్కందాలపై పెట్టుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా యాదవ కులస్తులందరినీ కొడారి రమేష్ యాదవ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు, ఉపసర్పంచ్ పడిదల సరోజన బాపురావు, యాదవ కుల సంఘ పెద్దలు పాల్గొన్నారు.