భద్రాధ్రికొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
ఇల్లందు మున్సిపాలిటీలో చల్లారని అవిశ్వాస సెగ
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా వేడెక్కిన వాతావరణం
అవిశ్వాసం వీగిపోయిన కొద్దిసేపట్లోనే అసమ్మతి కౌన్సిలర్ ఆస్తులపై అధికారుల దాడులు
బీఆర్ఎస్ కౌన్సిలర్ కొండపల్లి సరిత కుటుంబానికి చెందిన మామిడితోట సహా కోళ్ల ఫారంను ధ్వంసం చేసేందుకు యత్నించిన ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు
అడ్డుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు
ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ ఆందోళన
కౌన్సిలర్ల ఆందోళనతో వెనుదిరిగిన అధికారులు
తిరిగి తెల్లవారుజామున పోలీసుల సహకారంతో మామిడితోటను, నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు
అటవీశాఖ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయంటూ సమాధానమిస్తున్న అధికారులు
భూమిపై అన్ని హక్కులు ఉన్నాయంటున్న కౌన్సిలర్ కుటుంబసభ్యులు
కాంగ్రెస్ నేత మున్సిపల్ చైర్మన్ కు వ్యతిరేకంగా నిర్వహించిన అవిశ్వాస పరీక్షలో పాల్గొన్నందుకు తమను ప్రభుత్వం టార్గెట్ చేసిందంటున్న కౌన్సిలర్లు
ఘటనాస్థలికి చేరుకుని అధికారులను ప్రశ్నించిన బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే హరిప్రియ
ఇదేనా ప్రజా పాలన అంటూ అధికారులను నిలదీసిన హరిప్రియ
దాడులు ఆపకపోతే పోరాటానికైన సిద్ధమని హెచ్చరించిన మాజీ ఎమ్మెల్యే హరిప్రియ
మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి ఆందోళనకు దిగనున్న మాజీ ఎమ్మెల్యే హరిప్రియ