హసన్ పర్తి / నేటి ధాత్రి
హసన్‌పర్తి 66 వ డివిజన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో మేకల వంశ వేదిక ఆద్వర్యంలో మేకల వంశస్థులు విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు. మేకల వంశవేదిక అధ్యక్షులు యుగేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ సి.ఐ సురేష్ ని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సి ఐ మాట్లాడుతు విద్యార్థులను ప్రతిభావంతులుగా తయారు చేసేది ఉన్నత ప్రమాణాలు కలిగిన ఉపాద్యాయులు ప్రభుత్వ పాఠశాల ఉపాద్యాయులని అన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల లో చదివి ఉన్నత శిఖరాలని చేరాలని కోరారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వివిధ రంగాల లో నైపుణ్యవంతులు గా తయారు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రన్సిపల్ చాడ సుదర్శన్ రెడ్డి ,కార్పోరేటర్ గురుమూర్తి శివకుమార్ బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు పాపిశెట్టి శ్రీధర్, కాంగ్రెసు పార్టీ డివిజన్ అధ్యక్షులు కానిపర్తి కిరణ్, భాజపా డివిజన్ అధ్యక్షులు మారం తిరుపతి, మేకల వంశ వేదిక ప్రదాన కార్యదర్శి హరిశంకర్ ఉపాధ్యక్షులు ఆనంద్, రమేష్, శోభన్, సహ ప్రదాన కార్యదర్శి రాజేందర్, కార్యదర్శి సిద్దార్థ, కార్యవర్గ సభ్యులు సురేష్ సభ్యులు కన్నయ్య, కమిటీ సభ్యులు తిరుపతి, వేణు, కమలాకర్ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.