భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తున్న బిజెపిని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించండి

భువనగిరి కోటపై ఎర్ర జెండా ఎగరాలి

మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

నల్గొండ జిల్లా, నేడి ధాత్రి :

భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్న బిజెపిని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని, పోరాటల అడ్డా భువనగిరి కోటపై ఎర్ర జెండా ఎగురావేయాలంటే భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎం.డి జహంగీర్ ను గెలిపించాలనిఆయన అన్నారు. శుక్రవారం గట్టుపల మండల కేంద్రంలో సిపిఎం చండూరు, గట్టుపల మండలాల విస్తృత స్థాయి సమావేశం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చాపల మారయ్య అధ్యక్షతనసమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. పూటకో పార్టీలు మార్చే నాయకులను ఓడించాలని, మునుగోడు నియోజకవర్గవెనుకబాటుకు కారణం గత పాలకులే కారణమని ఆయన అన్నారు. మూసీ నది ప్రక్షాళన చేయాలనిపాదయాత్రలు,సాగు,త్రాగునీరు కోసం పోరాటాలు నిర్వహించడంలో కమ్యూనిస్టులు కీలకపాత్ర పోషించారనిఆయన అన్నారు. మునుగోడు నియోజకవర్గం లో ఇండ్ల స్థలాల కోసం, కార్మికుల కోసం, గీత కార్మికుల సమస్యల కోసం, పేద ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడింది కమ్యూనిస్టు లేనని ఆయన అన్నారు.దేశంలో భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా మార్చి, ఆ స్థానంలో మనుధర్మాన్ని తిసుకోచ్చి ఫ్యూడల్ పద్ధతులు ప్రవేశ పెట్టడం కోసం బీజేపీ కృషి చేస్తుందని, దీని ద్వారా కుల, మత, ప్రాంత విద్వేషాలు సృష్టిస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్ ఆలోచనలకు అడ్డుగా ఉన్న భారత రాజ్యాంగాన్ని మార్చడమే ద్యేయంగా బీజేపీ పనిచేస్తుందన్నారు. ఇప్పటికే సిఏఏ, పౌరసత్వరద్దు, జ్యోతిష్యశాస్త్ర అమలు, విద్యా కాషాయికరణ, ఇ.డి, సీబీఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను బెదిరించడం, వారిని లొంగదీసుకోవడం, మేధావులను జైల్లల్లో పెట్టడం లాంటి వాటిని బలవంతంగా అమలు చేస్తుందన్నారు. బిజెపి గత ఎన్నికల ముందు రైతులను రెట్టింపు ధనవంతులను చేస్తామని చెప్పిందన్నారు. నల్ల డబ్బును బయటికి తీసి దేశ ప్రజల ఖాతాల్లో ప్రతి ఒక్కరికి 15లక్షలు జమ చేస్తామని చెప్పిందన్నారు. ఆమాట ఎక్కడికి పోయిందోనన్నారు మరోవైపు బిజెపి అధికారంలోకి వచ్చాక అవినీతికి చట్టబద్ధత కలిగించిందన్నారు. ఎలెక్ట్రోల్ బాండ్స్ రూపంల్ 1600 కోట్ల రూపాయల అవినీతి జరిగితే 800 కోట్ల రూపాయలు బిజెపికి పార్టీకి చేరాయన్నారు. ఈ ఎలెక్ట్రోల్ బాండ్స్ చట్ట విరుద్ధమైనవని సిపిఎం పోరాడిందన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం వల్ల అవినీతి బయటికి వచ్చిందన్నారు. విద్యా రంగానికి కేవలం ౦,4% మాత్రమే నిధులు కేటాయించారని విద్యను పూర్తిగా ప్రయివేటికరణ చేశారన్నారు. ఆకలిశుచిలో మనదేశం 111 స్థానంలో ఉందన్నారు. లిక్కర్ కేసులో బిజెపికి ఆరవిండో పార్మా కంపెనీ అధినేత శరత్ చంద్రారెడ్డి ద్వారా 60 కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయన్నారు. వ్యాపారస్తులు వేరు, రాజకీయ నాయకులు వేరుగా ఉండేవారని అన్నారు. కానీ నేడు వ్యాపారస్థులే రాజకీయ నాయకులుగా మారారన్నారు. నేటి ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలు ఉన్న అధిపతులు పోటీ చేస్తున్నారని వారు ఇంకా ఎక్కువ సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తారన్నారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, మునుగోడు నియోజకవర్గం ప్రజలందరికీ సిపిఎం చేసిన పోరాటాలు తెలుసునన్నారు. సిపిఎం పోరాటాల ఫలితంగా పేదలకు భూములు, ఇండ్ల స్థలాలు సాధించిపెట్టారన్నారు నేడు ప్రజలు వాటిని అనుభవిస్తురన్నారని అన్నారు.. మునుగోడు నియోజకవర్గంలో ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామన్నారు. భువనగిరి పార్లమెంట్ ఏర్పడిన 2009 ఎన్నికల నుండి సిపిఎం పోటీ చేస్తుందన్నారు. అందుకే నిరంతరం నిజాయితీగా, నికరంగా, అవినీతికి తావులేకుండా ప్రజాసమస్యలపై పోరాడే సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఎండి జహంగీర్ పోటీ చేస్తున్నారని, అందుకు మునుగోడు నియోజకవర్గం ప్రజలు ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాడే అభ్యర్థిని ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులుచాపల మారయ్య, సిపిఎం చండూరుమండల కార్యదర్శి మొగుదాల వెంకటేశం,సిపిఎం చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ గౌడ్, సిపిఎం గట్టుపల్ మండల కమిటీ సభ్యులు కర్నాటి సుధాకర్, అచ్చిన శ్రీనివాస్, పి.శ్రీను, ఖమ్మం రాములు, కర్నాటి తుకారం,పెద్దగాని నరసింహ, బి నరసింహ, బి యాదయ్య,విశ్వనాథం,అబ్బయ్య,ఈరటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version