#నాకు ఆస్తులు లేవు…. ప్రజలే నా ఆస్తి.
#గ్యారెంటీ వ్యారంటీ లేని కాంగ్రెస్ మోసపూరిత పథకాలు.
#మండలంలో రెండో విడత ప్రచారం జోరుగా సాగింది.
#అడుగడుగునా బతుకమ్మ మంగళహారతులతో మహిళల నీరాజనాలు.
#అలరించిన గంగిరెద్దుల , కాకి పడగ వారి విన్యాసాలు.
నల్లబెల్లి, నేటి ధాత్రి: ఒక మధ్యతరగతి రైతు బిడ్డగా నా జీవిత ప్రయాణాన్ని ప్రారంభించి ఈ స్థాయి వరకు చేరుకున్నాను అంటే దానికి ప్రజలు నాపై ప్రేమఅభిమానం చూపిఆశీర్వదించడంతో ఈరోజు మీ మధ్య ఇలా ఉన్నానని బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు శనివారం మండలంలోని రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని బోలోని పల్లి గ్రామ శివారులో గల బద్ది పోచమ్మ ఆలయానికి చేరుకొని తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి రామతీర్థం, పద్మాపురం, బుచ్చిరెడ్డిపల్లి, కన్నారావుపేట, అరువయ్య పల్లె, శనిగరం, బిల్లా నాయక్ తండ, రుద్రగుడెం, పెద్ద తండా, చిన్న తండా, బజ్జు తండా, గుండ్లపాడు, మీదుగా కొనసాగుతూ నారాక్కపేట గ్రామంలో ముగిసింది ఈ సందర్భంగా గ్రామ గ్రామాన మహిళలు బోనాలు, బతుకమ్మ, మంగళ హారతులతో నీరాజనాలు పలుకుతూ స్వాగతించారు అలాగే మహిళలు ఎమ్మెల్యే పెద్దికి వీర తిలకం దిద్దుతూ విజయకేతనం మనదే అంటూ ధీమా వ్యక్తం చేశారు కెసిఆర్ పెన్షన్ తీసుకునే వృద్ధులు , వికలాంగులు, బీడీ కార్మికులు, వితంతువులుమా ఓటు మరోసారి నీకే అంటూ పెద్దికి భరోసా కల్పించారు అదేవిధంగా గంగిరెద్దులకుటుంబాలు పెద్దికి స్వాగతం పలికి గంగిరెద్దులతో విన్యాసాలు చేశారు అనంతరంరామతీర్థం గ్రామంలో ఓ చిన్నారిని ఎత్తుకొని ముద్దాడడంతో ఎమ్మెల్యే పెద్ది ఎన్నికల ప్రచారంలో ఆకర్షణగా నిలిచారు ఎన్నికల ప్రచారాలలో ఆయా గ్రామాలలో పెద్ది మాట్లాడుతూ నేను ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబ నుండి వచ్చిన మీ బిడ్డను రాజకీయంగా నేను ఇంత స్థాయికి ఎదగడానికి మీ యొక్క ప్రేమ ఆశీస్సులతో నేను ఈరోజు ఇలాగా ఉన్నానని నాకు మీరు నియోజకవర్గ ప్రజలే దిక్కు అంటూ వేడుకున్నారు తొలిసారిగా మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలుపొందగా రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి రావడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయిందని తర్వాత మహమ్మారి భారీ నుండి కోలుకున్న తర్వాత మూడు సంవత్సరాల కాల వ్యవధిలోనే గత పాలకులు చేయని అభివృద్ధిని చేసి మీ కళ్ళ ముందు ఉంచానని ప్రజలకు ఏ విధమైన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు కావాలో నాకు తెలుసునని అందుకే నియోజకవర్గానికి విద్య, వైద్య, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 50%ఇన్పుట్ సబ్సిడీ వ్యవసాయ పరికరాలు తీసుకువచ్చి రైతాంగాన్ని ఆదుకున్నానని నియోజకవర్గ ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని జిల్లా ఆసుపత్రిని తీసుకువచ్చి పనులు పూర్తిచేసుకుని మరికొన్ని రోజుల్లోనే ప్రారంభించుకోవడం జరుగుతుందని యువత విద్యారంగంలో రాణించాలని పలు గురుకులలా తోపాటు మెడికల్ కాలేజీని మంజూరు చేయించి నర్సంపేటను విద్య హబ్బుగా మార్చడం జరిగింది పుట్టిన గడ్డకు కీర్తి తేవాలని ఆకాంక్షతో మండలానికి మిర్చి పరిశోధన కేంద్రాన్ని తీసుకువచ్చి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని మిర్చి పండించే రైతులు మండలంలో అధికంగా ఉన్నారని ఎన్నో సంవత్సరాలుగా మిర్చి పంటలు పండిస్తూ రాష్ట్రానికి రోల్ మోడల్ గా నిలిచారని కాగా గత కొన్ని సంవత్సరాలుగా మిర్చి పంటలకు పలు రకాల తెగుళ్లు వ్యాప్తి చెంది రైతాంగం నష్టపోతుందని తెలుసుకొని నియోజకవర్గ రైతాంగంమరోసారి నష్టపోకుండా ఎక్కడికి పోయి పంటలను పరిశోధన చేయించుకునే దుస్థితికిరావద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుపోగా వెంటనే స్పందించి మిర్చి పరిశోధన కేంద్రాన్ని మండలానికిమంజూరు చేయడం జరిగిందని నేను రైతులకు సేవ చేశానే తప్ప ఆస్తులు, వ్యాపారాలకోసం తపించేవ్యక్తిని కాను అని.. ప్రజల కోసం బ్రతికే వ్యక్తినని గతఎమ్మెల్యేలు ప్రజా క్షేత్రంలో ఉండి ప్రజలకు సేవ చేయాల్సింది పోయి వారి సొంత స్వలాభం కోసం కాంట్రాక్ట్ పనులకే పరిమితం అయ్యారు తప్ప నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదు గత ఎన్నికల్లో ఓడిపోవడంతో నాలుగు సంవత్సరాలుగా ఏ రోజు ప్రజలకు ముఖం చూపించని నాయకులు మళ్లీ ఎన్నికలు రాగానే పగటి వేషగాళ్లగా మీ ముందుకు వస్తున్నారని అలాంటి వ్యక్తులను ఆదరిస్తే అభివృద్ధి కుంటుపడుతుందని ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి కావాలో.. కాంట్రాక్ట్ పనులు చేసుకునే వ్యక్తి కావాలో ఆలోచించాలని మీ ఆశీర్వాదంతో మరొక్కసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి, ఎన్నికల ఇంచార్జ్ కన్వీనర్ చెట్టుపల్లి మురళీధర్ రావు, ఎంపీపీ ఉడుగుల సునీతప్రవీణ్ గౌడ్, వైస్ ఎంపీపీ గందే శ్రీలత శ్రీనివాస్ గుప్తా, నర్సంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాలెపు రాజేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి కోటిలింగాచారి, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మండల నాయకులు తేజ వత్ సమ్మయ్య నాయక్, తిప్పనిరవీందర్ గౌడ్, మామిండ్ల చిన్న మోహన్ రెడ్డి, కిరణ్, శివాజీ, సర్పంచులు తిప్పని సృజనా లింగమూర్తి, కిరణ్, వెంకన్న, నిర్మల రవీందర్, మల్లికాంబ, రవళి మురళి, గోనె శ్రీదేవి, జాటోతు పద్మ, వక్కలమల్లక్క, ఎంపీటీసీలు బొల్లా శ్రీలత రమేష్, రవీందర్, ఓదెల విజయరవి, యూత్ అధ్యక్షుడు డ్యాగాల కృష్ణ, గుమ్మడి వేణు, మీడియా ఇన్ఛార్జి అంబరగొండ రాజు తదితరులు పాల్గొన్నారు.