నర్సంపేట,నేటిధాత్రి :
నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వరంగల్ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్న డ్యాగల శ్రీనివాస్ ను జాతీయ అధ్యక్షులు డాక్టర్ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అయిలినేని శ్రీనివాసరావు డ్యాగల శ్రీనివాస్ ను అదనంగా వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా బాధ్యతలు ఇస్తున్నట్లు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గాలిపెళ్లి గంగాప్రసాద్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు నక్క గంగారాం, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు విశ్వనాథుల రమేష్, యూత్ వింగ్ కన్వీనర్ పైడిమర్రి రవీందర్ లు పాల్గొన్నారు.