సిఐటియు రాష్ట్ర కార్యదర్శి వెంకటస్వామి..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మునిసిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల 22వ వార్డు స్థానిక జయశంకర్ చౌరస్తా సమీపంలో డిఎంఎఫ్టి నిధుల నుండి సిసి రోడ్డు వేయిస్థానంటే సిఐటియు యూనియన్ అడ్డుకుంటుందని స్థానిక ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్న 22వ వార్డు కౌన్సిలర్ భర్త తీరును సిఐటియు రాష్ట్ర కార్యదర్శి వెంకటస్వామి తప్పుబట్టారు. అనంతరం సిఐటియు రాష్ట్ర కార్యదర్శి వెంకటస్వామి మాట్లాడుతూ…. సిఐటియు యూనియన్ ను విమర్శిస్తే సహించేది లేదని అన్నారు. వార్డులో ఉన్న సమస్యలపై ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడంలో శ్రద్ధ చూపాలే తప్ప స్వలాభం కోసం పనులు చేయకూడదని అన్నారు. ఖాళీ స్థలం పక్కననే సిఐటియు యూనియన్ కార్యాలయం ఉందని కాలీ జాగాను కబ్జా చేసేందుకు గతంలో సైతం ప్రయత్నం చేశాడని దుయ్యబట్టారు. అనుమతులు లేకుండా చెట్లు కొట్టివేయడం చట్టరీత్యా నేరమని అన్నారు. ఇకనైనా కౌన్సిలర్ భర్త తీరు మార్చుకోవాలని లేనిపక్షంలో ప్రజాస్వామ్యంలో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు వడ్లకొండ ఐలయ్య, సంజీవ్, వెంకటేష్, శ్రీధర్, నవీన్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.