చేర్యాల నేటిధాత్రి
చేర్యాల పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చేర్యాల పట్టణ అద్యక్షులు మంచాల చిరంజీవులు మాట్లాడుతూ
మా డీసీసీ అద్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి పైన చేస్తున్న అర్దరహిత విమర్శలను చూస్తుంటే సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డికి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏమైనా ఆవహించిండా అనే అనుమానం కలుగుతుంది అన్నారు.
చేర్యాల పెద్ద చెరువు కట్ట సుందరీకరణ పనులను గత ప్రభుత్వ నిర్లక్ష్యం చేసిన విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే. మరి అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తే విమర్శలు ఎందుకు చేస్తున్నారో సీపీఎం నాయకులు సమాధానం చెప్పాలి. అని దుయ్యబట్టారు
రాజకీయంగా ఎదుర్కోలేక పల్లా రాజేశ్వర్ రెడ్డితో కుమ్మక్కై మా నాయకుని పైన చౌకబారు విమర్శలు చేయడం మాని నియోజకవర్గ అభివృద్ధిలో మాతో పాటు భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం. అన్నారు గెలుపోటములతో సంబంధం లేకుండా జనగాం నియోజకవవర్గ అభివృద్ధికి కృషి చేస్తుంటే జీర్ణించుకోలేక ప్రజల్లో తమ ఉనికిని చాటుకోవడానికి మీరు చేస్తున్న చిల్లర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని నిరాధార ఆరోపణలు చేసినా జనగామ నియోజకవర్గ అభివృద్ధి భాధ్యత మాత్రం మా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారిదే అని మీకు గుర్తు చేస్తున్నాం. అన్నారు ఈ సమావేశంలో సీనియర్ లీడర్లు తుమ్మలపల్లి సంజీవులు మంజే మల్లేశం కాశెట్టి ఉపేందర్ సనాది భాస్కర్ ముస్త్యాల దామోదర్ దాసరి శ్రీకాంత్ అంబాల బుచ్చి రాములు గౌడ్, మామిడాల నాగరాజు నర్ర రమేష్ సాయి రాకేష్ తదితరులు పాల్గొన్నారు