పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని స్థానిక 55వ బూత్ లో కౌన్సిలర్ సంపత్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఓటరును కలిసి అభివృద్ధి,సంక్షేమ పథకాలను,మేనిఫెస్టోను వివరించాలి.కాంగ్రెస్ కు ఓటు వేస్తే తెలంగాణ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది.కారు గుర్తుకు ఓటు వేసి చల్లా ధర్మారెడ్డిని గెలిపించాలని తెలంగాణలో నవంబర్ 30వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల ఆశలకు అనుగుణంగా ఉందని అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేలా ఉందని మేనిఫెస్టో, అభివృద్ధి,సంక్షేమ పథకాలను చూసి ఓటు వెయ్యలని
తెల్లరేషన్ కార్డున్న ప్రతి పేదింటికి కేసీఆర్ బీమా పథకం కింద రూ.5లక్షలు బీమా ఇవ్వడం జరుతుందని ప్రతి కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామనడం,ప్రతి పేదింటి మహిళకు రూ.400లకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
ప్రస్తుతం ఉన్న ఆసరాను రూ.5వేలకు,దివ్యాంగులకు రూ.6వేలకు పెంచడం అభాగ్యులకు ఆర్థిక భరోసానిస్తుంది.
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు పంటపెట్టుబడి సాయాన్ని రూ.16వేలకు పెంచడం జరుగుతుంది.
బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో రైతులను,మహిళలను ,అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించడం కేసీఆర్ కార్యదక్షతను తెలియజేస్తుందని.బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతుందని,మూడు వైద్య కళాశాలలు ఉన్న స్థాయి నుంచి స్వరాష్ట్ర తెలంగాణలో 33 జిల్లాలకు 33 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం సువర్ణ అధ్యాయంఅని ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుచూపుతో దూరదృష్టితో జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం వల్ల దీని ద్వారా పేద ప్రజలకు ఉచిత,మెరుగైన వైద్యం అందుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.