రామడుగు, నేటిధాత్రి:
డిజిటల్ శాటిలైట్ స్కూల్, ట్రస్మా రాష్ట్రశాఖ కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలం వెలిచాల సరస్వతి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్, రామడుగు మండల కేంద్రంలోని విన్నర్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ పంజాల జగన్మోహన్ గౌడ్లను బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డులతో సత్కరించారు. ఈమేరకు హైదరాబాద్ లోని ఓఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యారంగంలో విశేష సేవలందించిన కరస్పాండెంట్లను అవార్డులతో సత్కరించారు. బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డులు అందుకున్న ఉప్పుల శ్రీనివాస్, పంజాల జగన్మోహన్ గౌడ్ లను ట్రస్మా రాష్ట్ర బాధ్యులు యాదగిరి శేఖర్ రావు, తదితరులు అభినందించారు.