జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లోని పవర్ మేక్ కంపెనీ నడిపిస్తున్న క్యాంటీన్ లో శనివారం ఉదయం అల్పాహారంలో పురుగులు రావడం జరిగింది. కార్మికులకు కలుషిత ఆహారం విక్రయిస్తూ వారి ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న క్యాంటీన్ నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. గతంలో కూడా ఎన్నోసార్లు ఇలాగే నాణ్యత లోపం తో కూడిన, కలుషితమైన ఆహారాన్ని కార్మికులకు అందిస్తూ పట్టుబడడం జరిగిందని, ఈ విషయాన్ని పవర్ మేక్ యాజమాన్యానికి తెలియజేసిన,సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కార్మికుల ఆరోగ్యాల పట్ల ఇంత నిర్లక్ష్య వ్యవహరితో ఉండడం సింగరేణి యాజమాన్యానికి తగదని, వెంటనే పవర్ మేక్ యాజమాన్యంతో చర్చించి తగు చర్యలు తీసుకోవాలని ప్లాంట్ అసిస్టెంట్ పర్సనల్ మేనేజర్ మోహన్ సింగ్ ని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ప్రెసిడెంట్ పేరం రమేష్, జనరల్ సెక్రెటరీ తొగర్ కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ ఎలుక రమేష్, నాయకులు తిరుపతి రెడ్డి,రామగిరి మల్లేష్, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ జనంపల్లి శ్రావణ్ కుమార్, జాయింట్ సెక్రెటరీ మద్దుల రాజిరెడ్డి,చిప్పగుర్తి లింగయ్య,పత్తి నారాయణ, కోశాధికారి గోనే నరేష్,ప్రచార కార్యదర్శి గూడ మనోజ్ మరియు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.