జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
వినియోగదారులు వస్తువు కొనుగోలుకు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు.
జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో
ఏర్పాటు చేసిన వినియోగ దారుల అవగాహన సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రభుత్వం డిజిటల్ విధానం వర్చువల్ విచారణల ద్వారా వినియోగదారుల న్యాయం అనే థీమ్ ను ప్రకటించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులు దైనందిన జీవితంలో కోనుగోలు చేయు వస్తువులకు బాద్యతగా బిల్లులు తీసుకుని భద్రపరచుకోవాలని తెలిపారు. కొనుగోలు చేసిన వస్తువు పాడైతే నిర్ణీత సమయంలో వినియోగదారుల హక్కుల ఫోరంలో ఫిర్యాదు చేసి జరిగిన నష్టానికి తగిన పరిహారం పొందడానికి అవకాశం ఉందని అన్నారు. మెడికల్ షాపుల్లో మందులు కొనుగోలు దగ్గర నుండి నిత్యావసర వస్తువులు, బట్టలు,ఆన్లైన్ లో కొనుగోలు చేసిన వస్తువులల్లో వినియోగదారుడు మోసపోయినట్లు కానీ నాణ్యత లేనపుడు కానీ వినియోగదారులు బిల్లుతో పిర్యాదు చేయడానికి అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల తప్పనిసరి బిల్లులను భద్రపరచుకోవాలని సూచించారు. వస్తువు తూకపు సమయంలో వినియోగదారులు నిశితంగా పరిశీలించాలని తెలిపారు. తూకాలలో మోసపోవద్దని వస్తువు కొనుగోలులో పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. వ్యాపారస్తులు ఉపయోగించే తూనికలు కొలతల పరికరాలకు సకాలంలో ముద్ర వేయించుకొని లైసెన్స్ తీసుకోవాలని చెప్పారు.
జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ప్రజలకు వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అనంతరం వినియగదారుల హక్కులు, భాధ్యతలు, న్యాయ సహాయం, చట్టాలు తదితర అంశాలతో కూడిన కరపత్రాన్ని అవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాధ్, డిఎం రాములు, డిసిఐసి ఇంచార్జి అధికారి మల్లయ్య,
డిఆర్డీఓ నరేష్, కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్, రైస్ మిల్లర్స్, గ్యాస్, చౌక ధరల దుకణాల సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు,
సభ్యులు తదితరులు పాల్గొన్నారు.