వరంగల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ పరిధిలోని గొర్రెకుంట గ్రామ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థి నమిoడ్ల సాధన్ శాయంపేట స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. తను చదువుకున్న పాఠశాలకు ఎంతో కొంత ఆర్థిక సాయం అందించి అభివృద్ధి చేయాలని తపనతో పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడేలా సుమారు 10 వేల రూపాయల విలువ గల వంటసామాగ్రిని అందచేశారు. ఈ వంట సామాగ్రిని ఉపాధ్యాయులు,విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గత సంవత్సరం ఇదే పాఠశాలలో 10 వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రిని కూడా అందించామని తెలిపారు. విద్యార్థులు మంచి ఉతీర్ణత సాధించి పాఠశాలకు,గ్రామానికి మంచి పేరు తెచ్చిపెట్టాలని ఆకాంక్షించారు. అనంతరం కానిస్టేబుల్ సాధన్ ను
పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్యోతిర్మయి ఉపాధ్యాయ బృందంతో కలిసి సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు ఎలగొండ ప్రవీణ్,నమిoడ్ల కిరణ్,సిలువేరు రవి,ల్యాదల్ల చిన్ని,ల్యాదల్ల సంపత్,సిలువేరు ప్రవీణ్,శివ,జాన్, సుమన్,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.