ప్రభుత్వ సంక్షేమ పథకాలను
ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసిన వారికి అందరికీ అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.
కూకట్పల్లి, జూలై 13 నేటి ధాత్రి ఇన్చార్జి
కూకట్పల్లి ఇన్చార్జి బండి రమేష్ సూచ నలతో ,శనివారం కూకట్ పల్లి నియోజ కవర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీ ష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదా రు వేం నరేందర్ రెడ్డిని కలిశారు.ఈ సంద ర్భంగా నియోజక వర్గంలో నెలకొన్న సమ స్యల గురించి ఆయ నకు వివరించారు. అనంత రం కాంగ్రెస్ నాయకులతో వేంన రేందర్ రెడ్డి మాట్లా డుతూ కాంగ్రెస్ ప్రభు త్వం చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల చెందిన ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరు తున్నారని దీని మూలంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏమి ఇబ్బంది కలగద ని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ లో పని చేసిన వారికి విడుదలవారీగా పదవులు వస్తాయని, ఇతర పార్టీ నేతలు చేరినంత మాత్రాన ఎప్పటి నుండో ఉన్న కాంగ్రెస్ నేతలకు పదవులు రావని అపో హ ఉండకూడదని ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. కూకట్ పల్లి నియోజక వర్గంలో నెలకొన్న సమస్యల గురించి సంబంధిత అధికారులకు సమా చారం అందించి సమస్యలు పరిష్కరిస్తా మని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరిన కొత్త పాత కలయికతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని ఆ దిశలోనే క్రింది స్థాయి నాయకులు కార్యక ర్తలు ఆలోచించాలని మరోరకంగా అపో హతో ఉండకూడదని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తలపె డుతున్న ప్రజా సంక్షేమ పథకాలను చూ
సి ఇతర పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఈ సందర్భంగా తెలిపా రు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకులు కార్య కర్తలు వారధి గా ఉండి రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను, శ్రేణులను, కార్యకర్తలను కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బ్లాక్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి, తూము వేణు , సంజీవరావు, మేకల మైకల్, లక్ష్మణ్ వైస్ చైర్మన్ మాజీ, గొట్టిముక్కల వెంకటేశ్వ రరావు,సునీల్ యాదవ్,రాఘవేంద్ర రావు ,పుష్ప రెడ్డి, విట్టల్ రెడ్డి,తూము సంతోష్ కుమార్, దిండి అరవింద్ రెడ్డి, శ్రీకాంత్ పటేల్, పులి శివ గౌడ్, ఫణీంద్ర కుమార్, డివిజన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్,సతీష్ గౌడ్,మొయిను ద్దీన్,రమేష్ ముదిరాజ్,మధు గౌడ్,మేకల రమేష్ కుమార్,రాజేంద్ర కుమార్, చున్ను భాష,మస్తాన్ రెడ్డి,సోషల్ మీడియా శేఖ ర్,సచిన్ పటేల్,నాగమల్లేశ్వరరావు,శివ చౌదరి,తదితరులు పాల్గొన్నారు.