బిజెపికి వ్యతిరేకంగా వనపర్తి లో కాంగ్రెస్ పార్టీ నిరసన

వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో రాజీవ్ చౌక్ లో రాహుల్ గాంధీని కించపరుస్తూ రెచ్చగొట్టే పోస్టులు పెట్టినందుకు నిరసనగా బిజెపికి వ్యతిరేకంగా వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల చందర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీని రావణాసురుడిగా పోస్టర్ తయారుచేసి అధికార భారతీయ జనతా పార్టీ వెబ్ సైట్ లో పెట్టడం దారుణమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మీడియా ఇంచార్జ్ ద్వార పో గు మన్యం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!