మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండల కేంద్రనికి నూతన ఎస్ఐ గా భాద్యతలు స్వీకరించిన ఎస్ ఐ, అభిషేక్ రెడ్డి ని బుధవారం రోజు నవాబుపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. కేక్ కటింగ్ చేసి,పుష్పగుచ్చాన్ని అందించి శాలువా తో సన్మానం చేసినట్లు మండల అధ్యక్షులు నీరెటీ రామచంద్రయ్య తెలిపారు. నవాబుపేట మండలంలో శాంతి భద్రతలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ తరపున అన్ని రకాలుగా పోలీస్ శాఖ వారికి సహకరిస్తామని అన్నారు. ఎస్సై అభిషేక్ రెడ్డి, మాట్లాడుతూ,చట్టాల పరిరక్షణకు మీ అందరి సహకారం అందించాలని వారిని కోరారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.