బిజెపి అధికారంలోకి వచ్చి 100 రోజులైనా ఎస్సీ వర్గీకరణ చేయలే.
మాదిగ విశ్వరూప మహాసభను విజయవంతం చేయాలి.
ఎం ఎస్ పి మండల అధ్యక్షులు నేరెళ్ల ఓదెలు.
చిట్యాల, నేటి దాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం రోజున మహాజన సోషలిస్టు పార్టీ మండల అధ్యక్షులు నేరెళ్ల ఓదెలు
హైదరాబాదులోజరిగే మాదిగలఉపకులాల విశ్వరూప మహాసభ కరపత్రిక లు ఆవిష్కరించి మాట్లాడుతూ విశ్వరూప మహాసభను విజయవంతం చేయాలని అన్నారు, ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా నాయకులు మహాజన సోషలిస్టు పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గాజుల బిక్షపతిపాల్గొని గత 29 సంవత్సరాల నుండి కాంగ్రెస్ బిజెపిలు ఏబిసిడి వర్గీకరణ విషయంలో వర్గీకరణ చేయడంలో విఫలం చెందారు ఈ 29 సంవత్సరాల కాలం నుండి మాదిగ మాదిగ ఉపకులాలను మోసం చేస్తున్నారు బిజెపి అధికారంలో లేనప్పుడు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఏబిసిడి వర్గీకరణ చేస్తామని హామీ ఇవ్వడం జరిగినది కేంద్రం బిజెపి కేంద్ర మంత్రులు ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని 9 సంవత్సరాలు దాటిన ఏ బి సి డి వర్గీకరణకు కేంద్ర పార్లమెంటులో న్యాయం చేయలేకపోయినారు పార్లమెంట్ సమావేశంలో ఏ బి సి డి వర్గీకరణ చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ సి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కి నరేంద్ర మోడీ ఏ బి సి డి వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చినారుకానీ ఏ బి సి డి వర్గీకరణ చేయడం లేదు ఏబిసిడి వర్గీకరణ కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ మాదిగ ఉపకులాలు ప్రతి గ్రామం నుండి అధిక సంఖ్యలో లక్షలాది మందితో పేరేడ్ గ్రౌండ్లో బిజెపి పార్టీ కి కనువిప్పు కలిగే విధంగా బిజెపి పార్టీకి షాక్ తాగే విధంగా తరలి రావాలని విశ్వరూప మహాసభను విజయవంతం చేయాలిఅన్నారు, ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ భూపాలపల్లి నియోజకవర్గం ఇన్చార్జి అంతడుపుల సురేష్ మాదిగ జిల్లా యువజన సంఘం మంద కిరణ్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల నాయకులు ఎర్ర భద్రయ్య మాదిగ పర్లపల్లి రవి నేరెళ్ల భద్రయ్య జీడి పోసయ్య నేరెళ్ల స్వప్న కలికోట బొందమ్మ కలిగుట లక్ష్మి మట్టివాడ సరోజన ఇసంపెల్లి రమ్య పుల్ల రాధక్క కలికోట సరోజన పర్లపెల్లి రాజమ్మ తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు