బిఎస్పి పినపాక అసెంబ్లీ ఇంచార్జి బొమ్మేర రాంబాబు
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
చెవెళ్ల నియోజకవర్గం జన్వడ గ్రామంలో క్రైస్తవ మత స్తులను ఆర్ఎస్ఎస్ మతాన్మాదులు,గుండాలు సమారు 300 మందికి పైగా క్రైస్తవ భోదకులపై అన్యాయంగా దాడి చేసి ఇనుప రాడ్ల తో కొట్టారు. ఈ విషయంపై బాధితులను పరమర్శించడానికి బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అద్యక్షులు అర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిందుతులను అరెస్ట్ చెయ్యకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అరెస్ట్ చెయ్యడం నీతి మాలిన చర్య అని బిఎస్పి పినపాక అసెంబ్లీ ఇంచార్జి బొమ్మేర రాంబాబు అన్నారు. తెలంగాణ ప్రభుత్యం రోజు రోజుకు దిగజారుతు గత ప్రభుత్వం విదానాలే అవలంబిస్తుదని అన్నారు. రాబోవు రోజుల్లో ఈ ప్రభుత్యనికి క్రైస్తవ బోధకులు బుద్ది చెపుతారన్నారు.