చావులే తప్ప మాకు దిక్కు లేదంటూ ఆందోళన * మాకు న్యాయం చెయ్యాలి
శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలంలోని పెద్దకోడపాక మత్స్యకార సొసైటీ కార్మికులలో మళ్లీ ఆందోళన మొదలైంది. 13 గ్రామాల మత్స్యకారులు ప్రాజెక్టు చెరువులో కాంటాక్ట్ సిస్టం బంద్ అయినప్పటి నుండి ఏడు సంవత్సరాలుగా చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగిస్తుండగా నూతనంగా ఎంపికైన మత్స్యకార సొసైటీ చైర్మన్ గండి రాజమౌళి చెరువు కట్టు విధించాలంటూ చాపలు పట్టకూడదంటూ,మత్స్యకారులను భయభ్రాంతులకు గురి గురి చేస్తున్నాడు అంటూ మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం రోజున చాపలు పట్టుకుంటూ జీవనం కొనసాగించే 300 మంది మత్స్యకారులు బ్రిడ్జి వద్ద సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో మత్స్యకారులు మాట్లాడుతూ మత్స్యకారుని వృత్తి చాపలు పట్టుకుంటూ జీవనం కొనసాగించడమే తప్ప వేరే పని లేదని చెరువుకు కట్టు విధిస్తారని ఇప్పుడున్న పాలకవర్గం హెచ్చరికలు జారీ చేయడంతో మా యొక్క కుటుంబాలు రోడ్డున పడతాయని చావులే తప్ప మాకు దిక్కు లేదంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే ఎవరి వృత్తి వారు చేసుకుంటూ బ్రతకాలి అంటున్నారు. కానీ కొత్తగా ఎంపికైన చైర్మన్ ప్రాజెక్టు చెరువులో పడవలు దింపి వలలను తీసేస్తానని బెదిరిస్తున్నాడు.ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు మాపొట్ట కొట్టకూడదని విన్నవించుకున్నారు. ఇట్టి విషయంపై ఇప్పుడున్న పాలకవర్గం మత్స్య కార్మికుల పట్ల సానుకూల దృక్పథంతో స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని కోరడమైనది.