సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ సింగరేణి మండల నాయకులు.
కారేపల్లి నేటి ధాత్రి
సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కొత్తగూడెం జిల్లా ఐఎఫ్టియు భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ఎల్ విశ్వనాథం అకాల మృతి చెందారు బాధాకరమైన విషయమని ఇల్లందు 21 పిట్ చేరుకొని కామ్రేడ్ విశ్వనాథం పార్థివ దేహానికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పిస్తూ కామ్రేడ్ విశ్వనాధం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తు పెద ప్రజలతో మమేకమై వారి తో కలిసి మెలిసి ఉంటు వారి బాధలు పంచుకుంటూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటు అందరికి ఆపదలో ఆదుకున్న మంచి మనిషి అని నిస్వార్థంగా నిజాయితీ గా పనిచేస్తున్న వ్యక్తి అని కోనియాడుతు వారి కుటుంబానికి బంధుమిత్రులకు తమ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తున్నాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ సింగరేణి మండల కమిటీ గుగులోతు తేజ నాయక్. రావుల నాగేశ్వరావు. తాటి పాపారావు.విటల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.