వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గ ఎంసీపి ఐ (యు) అభ్యర్థిగా కామ్రేడ్ గడ్డం నాగార్జున

హన్మకొండ, నేటిధాత్రి:

ఓంకార్ భవన్ హైదరాబాదులో జరిగిన సమావేశంలో బిఎల్ఎఫ్ భాగస్వామ్య పక్షాలు బలపరిచిన వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గ ఎంసీపి ఐ(యు) అభ్యర్థిగా కామ్రేడ్ గడ్డం నాగార్జున గారిని ఎo సి పి ఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ధి కాయల అశోక్ ఓంకార్ గారు, బిఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్యప్రకాష్ గారు అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎంసీపిఐ(యు) ఎమ్మెల్యే అభ్యర్థి కామ్రేడ్ గడ్డం నాగార్జున మాట్లాడుతూ.. ఎన్నో ఆశలు ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ సర్కారు ప్రజల ఆశల్ని అడియాశలు చేసిందని అన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా అమలు జరపలేదు అన్నారు వ్యవసాయ సంక్షోభo పెరిగి రైతాంగం చాలా ఇబ్బందులు పడుతుందన్నారు రైతుల దగ్గర నుండి భూములను బలవంతంగా లాక్కుందన్నారు కేజీ టు పీజీ ఉచిత విద్య, డబల్ బెడ్ రూములు, ఇంటికో ఉద్యోగం, మరియు దళితులకు మూడెకరాల భూమి కలగానే మిగిలిందన్నారు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఇంతవరకు అమలకు నోచుకోలేదని వారన్నారు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు ప్రజలకు దక్కకపోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్నఆర్థిక విధానాలే కారణమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి సాధించడం కోసం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్ఎఫ్) పనిచేస్తుందన్నారు.
పూలే అంబేద్కర్ కారల్ మార్క్స్ ఆలోచన విధానాన్ని జోడించి రాష్ట్రంలో ప్రజల ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక సమన్యాయం సాధించడం కోసం ఎంసిపిఐ(యు), బిఎల్ఎఫ్ కలిసి పోరాటం చేస్తుందన్నారు
బి ఎల్ ఎఫ్- ఎం సిపిఐ( యు) అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సబ్ ప్లాన్ చట్టాలను సవరించి ప్రజల అనుగుణంగా అమలు చేయడం జరుగుతుందని అన్నారు. పశ్చిమ నియోజకవర్గాన్ని విద్య హబ్ గా మారుస్తామని అన్నారు ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి ప్రతి పేద విద్యార్థికి ఉచిత విద్య అందేలా పథకాలు తీసుకొస్తామని అన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలను రద్దుచేసి ప్రభుత్వ యూనివర్సిటీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు.ప్రతి ఏటా రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తుందని ఉన్నారు. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబాలకు ఇల్లు కట్టిస్తామన్నారు. ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకున్న వారికి హక్కు పత్రాన్ని ఇస్తామన్నారు. వ్యాప్తంగా ప్రభుత్వ భూములను గుర్తించి పేదలకు పంచుతామన్నారు.
బిఎల్ఎఫ్ బలపరిచిన ఎం సి పి ఐ (యు) వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి ఎంపికకు సహకరించిన ఎం సిపిఐ (యూ) పార్టీతెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గాదగోని రవి గారికి పార్టీ పొలిటి బ్యూరో సభ్యులు వల్లేపుఉపేందర్ రెడ్డి గారి కి , పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హేన్రెడ్డి హంస రెడ్డి గారికి గోనె కుమారస్వామి గారికి పెద్దారపు రమేష్ గారికి, మంద రవి బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ వనం సుధాకర్ గారికి మరియు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version