జనగామ, నేటిధాత్రి
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య, బచ్చన్నపేట మండలం, గోపాల్ నగర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్, పోచన్నపేట గ్రామంలోనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో చెక్పోస్టులు పకడ్బందీగా నిర్వహించాలని , పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి అన్ని ఏర్పాట్లు సమకూర్చాలన్నారు,
అనంతరం పోచన్నపేట మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పిల్లలకు అందిస్తున్న విద్యా వివరాలను అడిగి తెలుసుకుంన్నారు. ఉపాధ్యాయుల హాజరు వివరాల పట్టిక పరిశీలించి ముందస్తు అనుమతులు లేకుండా సెలవుల్లో వెళ్లకూడదని, పాఠశాల ఆవరణంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు,
పిల్లలకు నాణ్యమైన అల్పాహారం, మధ్యాహ్న భోజనం, త్రాగునీరు తదితర సౌకర్యాలను కల్పించాలన్నారు. ఈ తనిఖీల్లో ఆయన వెంట ఎన్నికల నోడల్ ఆఫీసర్ డిఎంఓ నరేందర్ రెడ్డి, పాఠశాల హెచ్ఎం అమృత, మేఘమాల, తదితరులు ఉన్నారు.