# దుగ్గొండి పురుషుల పొదుపు సమితి అధ్యక్షుడు ఉస్మాన్.
# కమ్మపెల్లిలో ఘనంగా 24 వ వార్షిక మహాసభ.
నర్సంపేట,నేటిధాత్రి :
గ్రామీణ ప్రజల్లో సమిష్టిగా పొదుపు చేయు అలవాటును ప్రవేశ పెట్టుట కోసం సహకార వికాస సంస్థ ఆధ్వర్యంలో స్వకృషి ఉద్యమం ద్వారా సహకార సంఘాలు ఏర్పాటు చేసి నేడు ప్రజల అవసరాలను తీరుస్తున్నదని దుగ్గొండి పురుషుల పొదుపు సమితి అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ అన్నారు.
నర్సంపేట మండలంలోని కమ్మపెల్లి గ్రామంలో గల నేతాజీ పురుషుల పొదుపు సంఘం 24 వ వార్షిక మహాసభ సంఘం అధ్యక్షుడు గంగిడి రాజిరెడ్డి అధ్యక్షతన బుదవారం జరిగింది.ముఖ్య అతిథిగా దుగ్గొండి పురుషుల పొదుపు సమితి అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్,ఎన్నికల అధికారి కందుల శ్రీనివాస్ గౌడ్,సమితి గణకులు పోలజు రమణాచారి హాజరైయ్యారు.సంఘంలో మొత్తం సభ్యులు 416 మంది ఉండగా 2023 డిసెంబర్ 31 నాటికి మొత్తం నిధులు 82 లక్షల 26 వేల 298 రూపాయల నిధులు ఉన్నాయి.కాగా సంఘం మరింత అభివృద్ది చెందడం కోసం సభ్యులు,సమితి బాధ్యుల సలహాలు సూచనలు తీసుకున్నారు.అలాగే పలు విధాలుగా చర్చించుకున్నారు.ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు ఉస్మాన్ మాట్లాడుతూ పొదుపుల వలన కుటుంబ అవసరాలు తీరుతాయని పేర్కొన్నారు.సంఘంలో అమలు అవుతున్న అన్ని రకాల ఖాతాలను వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు పెండ్యాల మల్లేశం,పాలకవర్గ సభ్యులు సాంబరాతి రమేష్,కోమాండ్ల శ్రీనివాస్ రెడ్డి, చిట్టోజు రాము, ఒద్దుల బుచ్చిరెడ్డి,వల్గుబెల్లి మోహన్ రెడ్డి,గడ్డం చెన్నయ్య, మేర్గు రాజు,పంజాల భాస్కర్,ఘణకులు దూపటి వెంకటేశ్వర్లు గౌడ్ తో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు.
# మృతుని కుటుంబానికి విపత్సాయం అందజేత ..
కమ్మపెల్లి గ్రామంలోని నేతాజీ పురుషుల పొదుపు సంఘ సభ్యుడు మిట్టగడల బాబు గత కొన్ని రోజుల క్రితం మరణించాడు.కాగా సంఘం అధ్యక్షుడు గంగిడి రాజిరెడ్డి అధ్యక్షతన మృతుని బార్య ఉమకు సామూహిక విపత్సాయం రూ.60 వేలు,అభయనిధి విపత్సాయం రూ.10 వేలు మొత్తం 70 వేల రూపాయలు సమితి అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ పాలకవర్గంతో కలిసి అందజేశారు.