ఏ బీ ఎస్ ఏఫ్ జిల్లా అధ్యక్షులు మంద ప్రమీల నరేష్
హన్మకొండ:నేటిధాత్రి
మెగా డీఎస్సీ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ
గురువారం కాకతీయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏ బీ ఎస్ ఏఫ్ జిల్లా అధ్యక్షులు మంద ప్రమీల నరేష్ మాట్లాడుతూ ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నా నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగా డీఎస్సీ ప్రకటించడం హర్షించదగ్గ విషయం అని అన్నారు దానితో పాటుగా రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలపై దృష్టి పెట్టి వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేయాలని సీఎం నీ కోరారు
జిల్లాలో మరియు రాష్ట్రములో ఉన్న పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాకపోవడంతో విద్యార్థులు పై చదువులకు పోవాలంటే ఆయా ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల ఫీజులు కట్టాలని వేదిస్తున్నారని అన్నారు అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ప్రభుత్వమే ఏర్పాటు చేయాలనీ అదేవిధంగా స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ విద్యార్థులకు సొంత భవనాలు లేకపోవడంతో విద్యార్థుల అద్దె భవనాల్లో ఇరుకు గదుల్లో ఉంటున్నారని అందువల్లా విద్యార్థుల తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని కాబట్టి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సొంత భవనాలు నిర్మించాలని అన్నారు అదేవిధంగా జిల్లాలో మరియు రాష్ట్రములో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ సంక్షేమ శాఖ ఎస్సి ఎస్టి బీసీ మైనారిటీ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులను ఎవరు పట్టించుకోవడం లేదని వారికీ నాణ్యమైన భోజనం మరియు విద్య అందడం లేదని అన్నారు వారికీ అన్ని విధాలుగా న్యాయం చేయాలనీ అన్నారు ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేసి రాష్ట్రము లో మరియు జిల్లాలో ఎక్కవ ఫీజులా దోపిడీ చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్రములో ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయే వాటిని గుర్తించి వాటికి కూడ ఉద్యోగ నోటిఫికేషన్ నీ విడుదల చేయాలనీ అన్నారు అదేవిధంగా యూనివర్సిటీలల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి విద్యార్థులకు మరియు నిరుద్యోగ యువత కి పూర్తిగా సపోర్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉండాలని కోరారు లేని యెడలో విద్యార్థుల సత్తా ఏంటో సీఎం కి తెలియజేస్తాం అని మంద ప్రమీల నరేష్ హెచ్చరించారు ఈ సమావేశంలో ఏ బీ ఎస్ ఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులు మచ్చ పవన్ కళ్యాణ్ నరేందర్ ప్రణయ్ అఖిల్ సుకురా సూర్య సాయి కిరణ్ వెంకటేష్ రాజ్ కుమార్ పృథ్వి రాజ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు