రామడుగు, నేటిధాత్రి:
హైదరాబాద్ నాంపెల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని కరీంనగర్ జిల్లా బీజేపీ రామడుగు మండల శాఖ ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా నరేష్ మాట్లాడుతూ దాడి చేసిన వారిని వదిలిపెట్టి, బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం విడ్డురమన్నారు. అధికారంలో ఉన్నామని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి కూడా పడుతుందని తెలిపారు. వెంటనే దాడికి యత్నించిన వారి మీద కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయలేని పక్షంలో అన్ని జిల్లాలో, నియోజకవర్గ పరిధిలలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయల ముందు ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.