ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ సభను విజయవంతం చేయాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

ఆసిఫాబాద్‌, కెరమెరి, జైనూరు మండల కేంద్రాలల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి సభ విజయవంతం కొరకు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా, ఇంద్రవెల్లి సభ ఆసిఫాబాద్‌ నియోజకవర్గ పరిశీలకులు గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ.
ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్ట మొదటిసారిగా ఇంద్రవెల్లి వేదికగా అమరులకు నివాళులర్పించి, ఆభివృద్ధిని ఒక ఉద్యమంలా తీసుకెళ్లేందుకు వస్తున్నారన్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ చేపట్టిన అభివృద్ధి పనులే నేటికీ గ్రామాలల్లో దర్శనమిస్తున్నాయన్నారు. ఆరుగ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించి కేంద్రంలో రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని బలపరచాలని నాయకులకు పిలుపునిచ్చారు.
నేడు ఇంద్రవెల్లిలో జరిగే సభకు నియోజకవర్గంలోని మొత్తం 10 మండలాల నుండి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి, విజయవంతం చేయాలని కోరారు.
అనంతరం పలువురు నాయకులు ఎమ్మెల్యే కి శాలువాలు కప్పి ఘన సన్మానం చేశారు. ఈ సమావేశంలో ఆసిఫాబాద్‌ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, ఎమ్మెల్యే అభ్యర్థి అజ్మిరా శ్యామ్ నాయక్, రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, ఎన్ఎస్సార్ సంపత్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మునీర్ హమద్, ఆదివాసి నాయకుడు పెందూరి గోపి తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version