శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్ రైసుమిల్లుపై సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు

హనుమకొండ, నేటి ధాత్రి :
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్ పెట్ లోని శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్ రైసుమిల్లుపై సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు
చేశారు. మిల్లులో నిల్వ ఉన్న సీఎంఆర్ ధాన్యాన్ని లెక్కించారు. అయితే సీఎంఆర్ ధాన్యంలో భారీ ఎత్తున బస్తాలు మాయమైనట్లు తేలింది. ఈ సందర్భంగా సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్
ప్రత్యేకాధికారి ఎల్ లక్మారెడ్డి మాట్లాడుతూ… బాలాజీ మిల్లుకు 2021-22, 2022-24 సంవత్సరాలకుగాను మొత్తంగా 6333 టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కు కేటాయించారు. దీనికిగాను
4310 టన్నుల బియ్యాన్ని తిరిగి మిల్లు యజమాని ఇవ్వాల్సి ఉండగా, కేవలం 1889 టన్నుల బియ్యాన్ని మాత్రమే ఇచ్చాడు. అయితే మిగతా 3521 టన్నుల ధాన్యం మిల్లులో ఉండాల్సి
ఉండగా, కేవలం 205 టన్నుల ధాన్యం మాత్రమే నిల్వ ఉన్నట్లు గుర్తించామన్నారు. మిగతా ధాన్యం మిల్లు యజమాని ప్రైవేట్ వ్యక్తులకు ఆమ్ముకున్నట్లు తేలిందన్నారు. కనపడని ధాన్యం
విలువ సుమారుగా రూ. 7.50 కోట్లు ఉంటుందని చెప్పారు. అయితే ప్రభుత్వం సీఎంఆర్ కింద ఇచ్చిన ధాన్యం మిల్లులకు ఒక ఆవకాశం ఇచ్చిందని, ధాన్యం లేనియెడల డబ్బులైన
ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పి గడువు ఇచ్చిందన్నారు. అయినప్పటికీ మిల్లుల యజమానులు స్పందించకపోవడంతో ఈ దాడులు చేస్తున్నట్లు వివరించారు. మిల్లు యజమాని రవీందర్రెడ్డిపై
క్రిమినల్ కేసులకు సిఫారపు చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట డీటీసీఎస్ నాగేంద్రప్రసాద్, ఎఫ్ఎస్ఐ మోటం సదానందం, టీవీ కనరాచా
ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *