పరకాల నేటిధాత్రి
నెహ్రూ జయంతిని పురస్కరించుకొని సిఎస్ఐ స్కూల్,సిఎస్ఐ అంగన్వాడి సెకండ్ సెంటర్లో నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.అనంతరం కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ హాజరై నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ నవంబర్ 14 ను బాలల దినోత్సవంగా జరుపుకుంటారని దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కు పిల్లలంటే చాలా ఇష్టమని దాంతో నెహ్రూ పుట్టినరోజును బాలల దినోత్సవం గా జరుపుకుంటారని పిల్లలే దేశ భవిష్యత్తు అని నెహ్రు నమ్మాడు,పిల్లలు పూర్తిగా వికసించడానికి,సంరక్షణ, పోషణ అవసరమయ్యే మొగ్గల వంటి వారని అనేవారని బాలల దినోత్సవం అనేది పిల్లల అమాయకత్వము, ఉచ్చు కథ, శక్తి, ఉత్సాహాన్ని జరుపుకునే రోజు బాలల దినోత్సవం ఒక వేడుక మాత్రమే కాదని బాలల హక్కులు వారి సంక్షేమం వారి భవిష్యత్తు,భద్రత గురించి ఆలోచించడానికి సమయం దొరికిన సందర్భం పండిట్ నెహ్రూ గొప్ప కృషి గుర్తుచేసుకునే రోజు అని నెహ్రూ గొప్పతనాన్ని సంపత్ కుమార్ కొనియాడారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి సెకండ్ సెంటర్ టీచర్ మడికొండ భాగ్య,ఆయా శారద,సిఎస్ఐ ఉపాధ్యాయులు రవీందర్,ఫయాజ్,పిల్లలు పాల్గొన్నారు.