కాంగ్రెస్ లోకి వలసల పర్వం.
శాయంపేట నేటి ధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మండల నాయకులు కార్యకర్తలు పట్టిపట్టనట్లుగా వ్యవహరిస్తున్నడంతో వారిలో వ్యతిరేకతలు నెలకొంటుందని తెలుస్తుంది. ఈ క్రమంలో ఓటర్ల తీరును అనుగుణంగా రాజకీయ పార్టీల నేతలు సైతం సొంతగూటికి వీడి కండువాలు మార్చేస్తున్నారు పార్లమెంటు ఎన్నికల సమీపిస్తుంది నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం గెలుపే లక్ష్యంగా పకడ్బందీ వ్యూహంతో వలసల కోసం గేట్లు తెరుచుకున్నారు.
కాంగ్రెస్ లోకి జోరుగా చేరికలు
మండల కేంద్రంలో గల అన్ని గ్రామాల వివిధ పార్టీల నాయకులు రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టే ఊపు మీద ఉన్న కాంగ్రెస్ లోకి చేరికల ప్రవాహం మొదలవుతుంది చేరికలను ఆహ్వానిస్తూ హస్తం పార్టీ నాయకత్వం నిర్ణయించడంలో ఇతర పార్టీలకు చెందిన నేతలు ఒక్కొక్కరుగా కండువా కప్పు కుంటున్నారు పార్లమెంటు ఎన్నికల్లో వీలైనంత సీట్లను గెలిపించుకునేందుకు ప్రణాళికను రచించి బలమైన నేతలకు టికెట్ ఇచ్చి గెలిపించే ప్రయత్నాలు సన్నాహాలు చేస్తుంది. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఉన్న కీలక నేతలు పార్టీని వీడి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలకు పేరేమితమై కాంగ్రెస్ పార్టీలోకి భారీగాచేరికలు జరుగు తున్నాయి.