వరంగల్ జిల్లా
తేదీ.17.09.2024
వరంగల్ శంభునిపేటలోని శ్రీ నాగేంద్ర స్వామి వారిని మంగళవారం ఉదయం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు చల్లా దంపతులకు తీర్థ ప్రసాదాలు అందచేసి ఆశీర్వచన చేశారు.ఆయన వెంట బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.