బాలాపూర్,(రంగారెడ్డి జిల్లా) నేటి, ధాత్రి:
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం సాయి నగర్ లో నివాసముండే శాంతమ్మ అనారోగ్యం కారణంగా కాలు పూర్తిగా కుళ్ళి పోయింది. శస్త్ర చికిత్స నిమిత్తం డబ్బులు లేక ఆర్థిక పరిస్థితులు బాగా లేక కదలలేని పరిస్థితిలో కుళ్ళిన కాలు నుండి వచ్చే దుర్వాసన తట్టుకోలేక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబ సభ్యులు .అక్షిత ఫౌండేషన్ చైర్మన్ సన్నీ కుమార్ రాపాక ను సంప్రదించగా వృద్ధురాలి ఇంటికి వచ్చి వాళ్ళ పరిస్థితి పూర్తిగా తెలుసుకొని అంబులెన్స్ లో సికింద్రాబాద్ లో గల గాంధీ హాస్పిటల్ లో చేర్పించి వైద్యులతో మాట్లాడి శస్త్ర చికిత్స ద్వారా కాలు తొలగించడం జరిగింది. అలాగే శస్త్ర చికిత్స నిమిత్తం రక్తం అవసరం అవగా అక్షిత ఫౌండేషన్ చైర్మన్ సన్నీ కుమార్ రక్తం ఇచ్చి తమ కుటుంబాన్ని దగ్గర ఉండి చూసుకున్నారు.