సింగరేణి 11 వెజ్ బోర్డ్ ఏరియర్స్ తీసుకున్న ఉద్యోగులకు ప్రశంసా పత్రములు

కొత్తగూడెం ఏరియా జిఎం ఎం. షాలెం రాజు. అందజేశారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

 

కొత్తగూడెం టౌన్.ఎన్ సి డబ్ల్యూ ఏ పదకొండవ వేజ్ బోర్డు నందు ఎక్కువ మొత్తంలో ఏరియర్స్ తీసుకున్న ఉద్యోగులకు ప్రశంసా పత్రములను కొత్తగూడెం ఏరియా జిఎం కార్యాలయం నందు కొత్తగూడెం ఏరియా జిఎం ఎం. షాలెం రాజు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా జిఎం మాట్లాడుతూ సింగరేణి కంపెనీ చైర్మన్ ఎన్.శ్రీధర్ గారి చొరవతో ఎన్ సి డబ్ల్యూ ఏ పదకొండవ వేజ్ బోర్డు సవరించిన జీతాలను ముందుగా మన సింగరేణి ఉద్యోగస్తులకు అందజేయడం జరిగిందని మరియు తేదీ. 21.09.2023 న కంపెనీ మొత్తంలో 11వ ఏజ్ బోర్డు ఏరియాల్సును వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలను జమ చేయడం జరిగిందని అందులో భాగంగా కొత్తగూడెం ఏరియా నుండి ఎక్కువ మొత్తంలో ఏరియాలను పొందిన ముగ్గురు కార్మికులకు ప్రశంస పత్రములను ఇవ్వడం జరిగినది వారు జె.వి.ఆర్ ఓసి లో ఈపి ఆపరేటర్ గా పనిచేస్తున్న దొండబట్టి అజయ్ కుమార్ కు 5,42,256/- ఎక్కువ మొత్తంలో ఏరియల్ పొందిన మొదటివాడు మరియు పీవీకె .5Inc లో కోల్ కట్టర్ గా పనిచేస్తున్న బానోత్ సామ్య కు 5,28,078/- ఎక్కువ మొత్తంలో ఏరియల్ పొందిన రెండవ వాడు మరియు జె.వి.ఆర్ ఓసి లో ఏపీ ఫిట్టర్ కం మెకానిక్ గా పనిచేస్తున్న ఎం వెంకటేశ్వరరావు ఎక్కువ మొత్తంలో ఏరియల్ పొందిన మూడో వాడు వీరికి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం నందు జిఎం శాలెం రాజు గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రములను అందజేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జిఎం తోపాటు కొత్తగూడెం ఏరియా ఏజీఎం (ఫైనాన్స్) కే సుమలత, టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, పర్సనల్ మేనేజర్ డి కిరణ్ బాబు, బి.శివ కేశవరావు, సీనియర్ పిఓలు కే.దేవదాస్, జి.సంఘమిత్ర, ఎస్టేట్స్ ఆఫీసర్ ఎం.శ్రీనివాస్, యూనియన్ ప్రతినిధులు వై.ఆంజనేయులు, ఎం.రవికుమార్ మరియు జిఎం కార్యాలయంలో పనిచేయు సిబ్బంది, ఇతర సభ్యులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!