# కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
# కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో కోనాయిమాకుల వద్ద ధర్నా..
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి :
బావి భారత ప్రధాని రాహుల్ గాంధీ
దేశ వ్యాప్తంగా చేపట్టిన యాత్రలో ప్రజల నుండి వస్తున్న ఆదరణను ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై కుట్రలు పన్నుతున్నదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.దేశంలో వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ అకౌంట్ లను ఫీజింగ్ లో పెట్టడం పట్ల అందుకు నిరసనగా పరకాల నియోజకవర్గం గీసుకొండ మండల కొనాయమాకుల స్టేజి ప్రధాన రహదారిపై గీసుకొండ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిపాలు అవుతామని గ్రహించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బ్యాంక్ అకౌంట్స్ ఫీజింగ్ చేయడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను,కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవాలంటే పార్టీకి ఉన్న ఆర్థిక మూలాల మీద దెబ్బకొడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా ఉంటుందని ఉద్దేశ్యంతో బీజేపీ అధికారంలో ఉన్న ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీని అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు.ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకావాలని డిమాండ్ చేశారు.లేని యెడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో గీసుకొండ ఎంపిపి భీమగాని సౌజన్య గౌడ్,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మలపల్లి శ్రీనివాస్, పరకాల నియోజకవర్గం అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి, యూత్ కాంగ్రెస్ మండలం అధ్యక్షుడు ఆకుల రుద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శి కూసం రమేష్ వర్కింగ్, ప్రెసిడెంట్ నాగారం స్వామి, డివిజన్ అధ్యక్షుడు దూపకి సంతోష్ , జిల్లా నాయకులు కొండేటి కొమురారెడ్డి, ఆకుల మధు, సొసైటీ డైరెక్టర్ మేకల రాజకుమార్, రాజు, అనిల్, మర్రి కాంతి, పవన్,నాగారం రవి కుమార్, రమేష్ నాయక్, రాజన్న, నరేష్, రాజు, పాషా, రాజేశ్వరరావు, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.