డివైఎఫ్ఐ హనుమకొండ జిల్లా సహాయ కార్యదర్శి మంద సురేష్
పరకాల నేటిధాత్రి
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన దేశ వార్షిక ప్రణాళిక మించిన కేంద్ర బడ్జెట్ దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతలను విద్యార్థులను తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించింది అని డివైఎఫ్ఐ హనుమకొండ జిల్లా సహాయ కార్యదర్శి మంద సురేష్ అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ 24 ల్,25 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ దేశంలోనే ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని అన్నారు.ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీని పదేళ్ల కాలంలో అమలు చేయకుండా పూర్తిగా విమర్శించింది మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత పెట్టిన బడ్జెట్లో కూడా పూర్తిస్థాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పన గురించి మాట్లాడకుండా మరోసారి దేశంలో యువతను మోసం చేసింది అన్నారు.దేశంలో నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవాలంటే వ్యవసా మేతర రంగంలో ఆర్థిక వ్యవస్థ ఏటా దాదాపు7851లక్షల ఉద్యోగాలను స్పష్టించాల్సిన అవసరం ఉంది అని అన్నారు.