శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు మండల స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మండంలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మరియు రెసిడెన్షియల్ పాఠశాల 8 , 9,10వ తరగతి విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల విభాగం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దకోడెపాక, ప్రైవేటు పాఠశాలల విభాగంలో నవోదయ హైస్కూల్ శాయంపేట, రెసిడెన్షియల్ పాఠశాలల విభాగంలో ఎం జె పి ఆర్ ఎస్ శాయంపేట ప్రథమ స్థానంలో నిలిచారు. జన విజ్ఞాన వేదిక జిల్లా విద్యా విభాగ కన్వీనర్ బిక్షపతి పాల్గొని బహుమతు లు ప్రధానం చేశారు.అలాగే శంకరనారాయణ విశ్రాంత అసిస్టెంట్ ప్రొఫెసర్ కాకతీయ విశ్వవిద్యా లయం విద్యార్థులకు మూఢన మ్మకాల వలన కలిగే దుష్ఫలితాలను గురించి వివరించారు .ఈ కార్యక్ర మంలో స్థానిక మండల తహశీల్దారు సత్యనారాయణ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఫణిచంద్ర మండల విద్యాధికారి బిక్షపతి, బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపా ధ్యాయులు వెంకటేశ్వరరావు విద్యార్థులు పాల్గొన్నారు