కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసీసీ అగ్ర నేత జననాయకుడు ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు..
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు..
ఈ సందర్భంగా మాట్లాడుతూ,
భారతదేశంలో కులమతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వాలకు పార్టీలకు బుద్ధి చెప్పడం కోసం పేద ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడం కోసం భారత్ జోడో యాత్ర ప్రారంభించి 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశ ప్రజలందరినీ ఒకే తాటిపై నడిపించిన నాయకుడు రాహుల్ గాంధీఅని అన్నారు..
ప్రజా నాయకుడు రాహుల్ గాంధీ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండి ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు..
ఈ కార్యక్రమంలో
మాజీ సర్పంచ్ నియోజకవర్గ నాయకులు తోలెం నాగేశ్వరావు ,కరకగూడెం మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు మండల నాయకులు బరపాటి వేంకన్న , అత్తే సారయ్య , పూజారి వెంకన్న , గొగ్గలి రావి , మెడి శ్రీను , గాంధర్ల రామనాధం నాయకులు కార్యకర్తలు యువకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు..