నల్లబెల్లి, నేటి ధాత్రి:
ఏఐసిసి అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ భారత దేశంలో కుల మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడం కోసం పేద ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడం కోసం భారత్ జోడోయాత్ర ప్రారంభించి 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకువచ్చే దిశగా దేశ ప్రజలందరినీ ఒకే తాటిపై నడిపించిన నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు అలాంటి ప్రజా నాయకుడు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నామని అన్నారు కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యదర్శి మాలోత్ రమేష్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి చార్ల శివారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇస్తారు శేఖర్ గౌడ్, వై నాల అశోక్, నాయకులు చరణ్ సింగ్, మాలోత్ మోహన్, జెట్టి రామ్మూర్తి, మామిండ్ల కొమురెల్లి, ఇంద్రారెడ్డి, సంపత్ రెడ్డి, బత్తిని మహేష్, కుసుంబా రఘు, బత్తిని మల్లయ్య, మేడిపల్లి రాజు గౌడ్, బౌసింగ్ తదితరులు పాల్గొన్నారు.