వరంగల్ కాశీబుగ్గ జంక్షన్ వద్ద ఏ.ఐ.ఎస్.బి వార్షికోత్సవాల పోస్టర్స్ ఆవిష్కరణ
నేటిధాత్రి, వరంగల్ తూర్పు
జూన్ 25న జరిగే అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏ.ఐ.ఎస్.బి 74వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని వరంగల్ కాశిబుగ్గ అంబేద్కర్ జంక్షన్ వద్ద ఏ.ఐ.ఎస్.బి 74వ వార్షికోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏ.ఐ.ఎస్.బి గ్రేటర్ వరంగల్ నాయకులు అఖిల్ వార్షికోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ ఏ.ఐ.ఎస్.బి 1951లో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఏర్పడి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల సాధనకై కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సోషలిజం సాధనకై నేతాజీ కలలు కన్నా భారతదేశ పుననిర్మాణం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమిస్తుందని అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వ విద్యా సంస్థల, యూనివర్సిటీల పరిరక్షణకై, విద్య కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా గత 73వ సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతుందని కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా 74వ వార్షికోత్సవాలను ఏ.ఐ.ఎస్.బి శ్రేణులు ఘనంగా నిర్వహించాలని అఖిల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నాయకులు మోహన్, కుల్దీప్, రాజు, రణధీర్, విష్ణు ,రవితేజ, సాయి వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.